SERVICES…

బ్రాహ్మణ గృహ వాతావరణం , మంచి భోజనం , సెక్యురిటీ తో పాటు స్వంత బిడ్డల్లా చూసుకునే సిబ్బంది. 
ఉదయం అల్పాహారం , క్యారియర్ కట్టి ఇస్తారు , వేడినీరు స్నానం , టీ లేదా కాఫీ   తాగవచ్చు , రాత్రికి భోజనం … లభిస్తాయి . అవకాశం ఉంటె పార్ట్ టైం  ఉద్యోగం కూడా చేయ్యోచ్చు 

వివరాలకు : శ్రీపతి దుర్గారాణి  :   

Rs.1000 Membership is excluded and Mandatory for all. 

UP TO 15 DAYS

RS.2000  Inclusive all charges

Only for Regular Students

Monthly Hostel Fee

Rs.6000 Inclusive all charges

No Milk or luxury items..

One Time Payment Option

Rs.30000 for 6Months
Rs.48000 per 12 Months.

If required to exit, Rs.12000 will be deducted with current month
charge.

అన్ని వసతులతో పాటు మంచి వేడి బ్జోజనం పెట్టి మాట్లాడిస్తూ వారి బాగోగులు చూసే బ్రాహ్మణ సేవా ఆశ్రమం చిక్కడ పల్లి లో ఉన్నది  

 

వివరాలకు : శ్రీపతి దుర్గారాణి : 6304921292

BRAHMIN SEVA ASHRAMAM

SINGLE ROOM

15000

FOR HEALTHY ELDERS ONLY
ADVANCE : RS.,50000

2 OR 3 SHARING ROOM

RS.8000

ADMISSION RS.30000

GENERAL

RS.5000

ADMISSION
RS.5000 

ఇల్లు అసలే నడవడం లేదు , వెనుక ముందు ఎవరు లేరు , ఒంటరి బ్రాహ్మణులూ లేదా పిల్లలు లేని వృధ్ద దంపతులు ఐతే వారికి సంపూర్ణ ఉచిత వసతి లభిస్తుంది…  ధనం ఉండి మేము కట్టుకోగలము అనుకుంటే అలంటి వారికి కూడా ఆశ్రమం లో ప్రవేశం ఉంటుంది.  ధనం ఉన్నా లేకున్నా చౌకబారు / కుళ్లిపోయిన మనస్తత్వం ఉంటె వారికి అనుమతి లేదు. 

19th DECEMBER 2019 : NEW PENSION SCHEME : 

బ్రాహ్మణ సంక్షేమ భవన్ నుండి నెల నెల పెన్షన్ కొంతమందికి ఇస్తున్నాము ..
12 నెలలకు 12 మంది చొప్పున ఒక్కో గ్రూపు పెట్టి ఆ గ్రూపులో ఎవరికీ పెన్షన్ ఇస్తున్నామో వారిని కూడా యాడ్ చేస్తున్నాము.
ఏ నెలలో ఇస్తామని చెప్తారో వారు ఆ నెలలో పెన్షన్ పంపాలి

ఒక్కొక్కరు ఇద్దరు లేదా ఎక్కువ మందికి కూడా ఇవ్వచ్చు ..

దయచేసి మన పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆసరాగా నిలవండి ..
ప్రభుత్వమే చెయ్యాల్సిన పని లేదు ..

మనలో కొంతమంది కలిస్తే ఈ క్రింది విధంగా పెన్షన్ ఇవ్వచ్చు

12 మంది కలిస్తే 1 రికి ఇవ్వచ్చు
120 మంది కలిస్తే 10 మందికి ఇవ్వచ్చు
1200 మంది క్లిష్ట వంద మందికి ఇవ్వచ్చు

అలోచించి జాయిన్ అవ్వండి ..
ఇప్పుడే ఎవరికీ ఇవ్వాల్సిన పనిలేదు
జనవరి నుండి పెన్షన్ గ్రూపులు ఏర్పాటు అవుతాయి ..

ఆ గ్రూపులో 12 మంది + ఒక పేద బ్రాహ్మణ కుటుంబము ఉంటుంది
ఆ పన్నెండు మంది 12 నెలలు వారికి ఇస్తారు ..

మొత్తం పారదర్శకమే ..

మొదటి గ్రూపులో 12 మంది అవ్వగానే రెండవ గ్రూపుకు మార్చుట జరుగును

గ్రూపులో ఇస్తాము అని చెప్పి ఆ నెలలో ఇవ్వకుండా పోయేవారు జాయిన్ అవ్వద్దు దయచేసి

ఇది గొప్పతనానికి కాదు .. మానవత్వానికి చేస్తున్న ప్రయత్నం


మొదలు ఒక నెల ఇస్తాము అన్న వారు ఈ గ్రూపులో అందరు జాయిన్ అవ్వండి
12 మంది 12 మందిని కలిపి ఒక్కో గ్రూపులో జాయిన్ మేమె చేస్తాము ..
ఆ గ్రూపులో పేద బ్రాహ్మణ కుటుంబాల చిరునామా , పేరు , గోత్రము , అన్ని ఉంటాయి .. చదువుకుని వారితో మీరు కూడా మాట్లాడవచ్చు

వారికి మీరు స్వయంపాకం , మరియు బట్టలు ఇతర సహాయాలు కూడా చెయ్యొచ్చు


FOR ONE MONTH PENTION YOU CAN CONTRIBUTE DIRECTLY TO BENEFICIARIES AS FOLLOWS 
BPL A CLASS : RS.2000
PER MONTH ONE TIME IN YEAR. 

BPL B CLASS : RS.1000 PER MONTH ONE TIME IN YEAR

PLEASE NOTE : WE WILL WORK TOGETHER ONLY.  PLEASE SHARE YOUR CONTRIBUTION INFORMATION IN OUR GROUP DIRECTLY. NO HIDDEN CONTRIBUTIONS TO ANYBODY.

ధన్యోస్మి
గిరి స్వామీ

https://chat.whatsapp.com/DSN74FnJ8OdKQyLxFRYxXx

ఆదాయం సరిగా లేని బ్రాహ్మణులకు ఉచితహోమియోపతి వైద్య శాల ఉన్నది 

ప్రతిరోజూ   మధ్యాహ్నం 2 నుండి 5 వరకు పేషెంట్లు రావచ్చు అలాగే ఆరోగ్యం సరిగా లేని బ్రాహ్మణ కుటుంబాల వారికోసం అన్ని రకాలైన డాక్టర్లతో ప్రత్యేక హాస్పిటల్ కూడా నడుపుతున్నాము .. కానీ విధిగా ముందస్తు పర్మిషన్ తీసుకుని , బ్రాహ్మణ భవన్ లేఖతో వెళ్తేనే వారికి వైద్యం అందుతుంది. దీనికి కారణం ఉన్న హాస్పిటల్ ను తమ నోటి దురుసు  వల్ల చెడగొట్టుకుంటే , అసలైన పేద బ్రాహ్మణులూ ఇబ్బంది పడుతారు కనుక .. మీరు ఏ శాఖకు , ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే  మీ వివరాలు మాకు వాట్సాప్ మెసేజి పెట్టి రావచ్చు 

 

SRIPATI DURGA RANI
ADMIN OFFICER

 

బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించిన అన్ని ప్రభుత ప్రైవేటు  సమాచారం మన వద్ద లభ్యం అవుతుంది. అలాగే కావాల్సిన కుల ధృవీకరణ పత్రములు , లోన్ ప్రాసెస్ , ఇతర పధకముల సహకారం అన్ని ఉచితంగా చేయించి ఇవ్వబడును. కనుక మీకు ఏదైనా కావాలి అంటే తప్పకుండ మీరు మన  బ్రాహ్మణ సంక్షేమ  భవన్ కు విచేయ్యండి. 

వివరాలకు : శ్రీపతి దుర్గారాణి  

దహనము , సంచయనము
నుండి 9, 10, 11, 12 రోజుల వరకు కార్యక్రమములు నిర్వహించ బడును . 

సాంప్రదాయ పద్దతిలో బ్రాహ్మణ పురోహితులచేత మాత్రమె నిర్వహించబడును , భోక్తలు , దానములు , కర్తలు అందరు బ్రాహ్మణులే , వంటవారు  వడ్డన కూడా పక్కా బ్రాహ్మణులే .. 


ప్యాకేజి 
వస్తువులు , పురోహితులు , బోజనములు , దానములు అన్ని కలిపి ఒకే ప్యాకేజి క్రింద బుక్ చేసుకోబడును 

వివరాలకు : 
శ్రీపతి దుర్గారాణి 

మొదటి మాసికం నుండి సంవత్సరికాల వరకు మొత్తం ప్యాకేజి లభిస్తుంది .. 
కార్యాలయమునకు వచ్చి సంప్రదించండి 

శ్రీపతి దుర్గారాణి 

బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని పితృ పక్షము అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున ఉంది 

పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు , తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. దీనిని చదివి , బ్రాహ్మణుడు దొరకకున్ననూ , ఎవరికి వారు తర్పణము చేయవచ్చును

తర్పణము అర్థము , అవసరము , ప్రాశస్త్యము వంటి వాటి గురించి వేరొక చోట వ్రాయుచున్నాను 

ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ’ పార్వణ శ్రాద్ధం ’ లేక ’ చటక శ్రాద్ధం ’ అంటారు..కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు ..
.తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు… దర్శ శ్రాద్ధము , ఆమ శ్రాద్ధము , హిరణ్య శ్రాద్ధము.

ఆ పద్దతి ముందుగా ఇచ్చి , తదుపరి తర్పణ విధి వివరించడమయినది..

దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం

పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య |
ఓం భూః ..ఓం భువః…ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| …..ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ |

ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్ప్య || శ్రీగోవింద గోవింద……దేశకాలౌ సంకీర్త్య , .అస్యాం పుణ్య తిథౌ

| ప్రాచీనావీతి |

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం … —– గోత్రాణాం. .. —— , ——– , —— శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం … ——– గోత్రాణాం , ——- , ——— ,——-దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,
అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం … —— గోత్రాణాం , ——–, ———- , ——— శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం … ——– గోత్రాణాం ,
——–, ———— , ————— దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం , అమావాస్యా పుణ్యకాలే ( సంక్రమణ పుణ్యకాలే ,/ సూర్యోపరాగ పుణ్యకాలే / సోమోపరాగ పుణ్యకాలే / వస్వాది పుణ్యకాలే ) దర్శ శ్రాద్ధం ../ .. ఆమ శ్రాద్ధం హిరణ్య రూపేణ అద్య కరిష్యే | తదంగ తిల తర్పణం చ కరిష్యే |

దక్షిణతో దర్భాన్ నిరస్య | అప ఉపస్పృశ్య |

హిరణ్య శ్రాద్ధం |

అమావాస్యా పుణ్యకాలే అస్మిన్ మయా క్రియమాణే హిరణ్యరూప దర్శ శ్రాద్ధే , ఏక బ్రాహ్మణ సంభవే వర్గ ద్వయ పితృణాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( అనేక బ్రాహ్మణ పక్షే పృథక్ వరణం కుర్యాత్ )
తాంబూలం , హిరణ్యం చ గృహీత్వా ||

|| హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసోః |
అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయఛ్చ మే ||

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం | ——– గోత్రాణాం. .. ——– , ——— , ——— శర్మణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం … ——— గోత్రాణాం , ——— , ———, ——–దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం … ——- గోత్రాణాం , ———, ——– , ———- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం … ——– గోత్రాణాం ,

——– , —- , ——— దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం ,దర్శ శ్రాద్ధ ప్రత్యామ్నాయం యద్దేయం అన్నం తత్ ప్రతినిధి హిరణ్యం వర్గ ద్వయ పితృ ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదదే | నమమ | ఓం తత్ సత్ |

ఉపవీతి |

ప్రదక్షిణం |

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

నమస్కారః

ప్రాచీనావీతి | వర్గ ద్వయ పితృభ్యో నమః | స్వామినః మయా కృతేన హిరణ్య రూప దర్శ శ్రాద్ధేన మమ వర్గ ద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసురితి భవంతోను గృహ్ణంతు | ఇతి ప్రార్థ్య |

( యజమానస్య వర్గద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసుః ఇతి బ్రాహ్మణాశీర్వాదః )

తర్పణమ్

దీనికి ఇచ్చిన బొమ్మ చూడుడు …దర్భలతో కూర్చలు చేసుకొన వచ్చును .

పితృ దేవతల ప్రీతి కొరకు అర్పించే తిలాంజలినే ’ తర్పణం ’ అంటారు..

ముఖ్య గమనిక :

ఇంటి లోపల తిల తర్పణము నిషిద్ధము..ఇంటి బయట ఆవరణలో గానీ , బాల్కనీ లో గాని లేదా తులసి కోట దగ్గరగానీ తర్పణము ఆచరించవచ్చును..

తండ్రి బ్రతికి ఉన్న వారు తర్పణము ఆచరించరాదు..సజీవులు గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి మాత్రమే తర్పణము ఇవ్వాలి.

అమావాశ్య , గ్రహణ కాలము , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలాలు , ఆయనములు , సంక్రమణ కాలములందు తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు ద్వాదశ పితృ దేవతలకు మాత్రము తర్పణం ఇవ్వాలి అనేది కొందరి మతము. అయితే , సాధారణ సంక్రమణము మరియు అమావాశ్యలందు ద్వాదశ పితృ దేవతలకు , మిగిలిన కాలాలలో సర్వే పితృ తర్పణము చెయ్యడము వాడుక లో ఉంది… వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి చేయవచ్చును..

మహాలయ పితృ పక్షమునందు మరియు పుణ్య క్షేత్రములందు సర్వ పితృ దేవతలకూ తర్పణం వదలాలి. మహాలయ పక్షము నందు ఆయా తిథులలో మరణించిన పితృ దేవతలకు ఆయా రోజుల్లో తర్పణం వదలవచ్చు.

తిథులు తెలియని యెడల , అందరికీ అన్ని రోజులూ తర్పణం వదలవచ్చు. అది వీలు కానిచో , కనీసం అమావాశ్య రోజైనా అందరికీ తర్పణం ఇవ్వాలి.. వారి వారి శక్త్యానుసారం చెయ్యవచ్చును.

తర్పణము ఇచ్చునపుడు , మొదట సంబంధము ( మాతుః … పితుః… మాతులః.. ఇలా ) , తరువాత వారి పేరు , గోత్రము చివర పితృదేవతారూపము ( వసు , రుద్ర , ఆదిత్య…. ఇలా ) చెప్పి వదలవలెను..

ఆడవారు సుమంగళి అయిన ’ దేవి ’ అని , కానిచో ’ కవీ ’ అని చెప్పి ఇవ్వాలి.

మాతృ , పితామహి , ప్రపితామహి…ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదలాలి..

మిగిలినవారికి , వారి వారి సూత్రానుసారముగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి…

ఇతర నియమాలు

తర్పణము ఇచ్చునపుడు కుడి చేతి ఉంగరపు వేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం ధరించాలి.

తర్పణానికి ఉత్తమమైన కాలము సుమారు మధ్యాహ్నము 12 గంటలకు . తర్పణము వదలు నపుడు ప్రాచీనావీతి గా ఉండి జంధ్యమును కుడి భుజం పై వేసుకొని ( అపసవ్యము ) ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని , కుడి చేతిలో నువ్వులు ఉంచుకుని , చూపుడు వేలు , బొటన వేలు మధ్యనుండి ( పితృ తీర్థం లో ) నీరు , తిలలు వదలాలి
తర్పణము ఈ కింది సందర్భాలలో ఆచరించవచ్చు..

అమావాశ్య మరియు సాధారణ సంక్రమణ కాలములందు

గ్రహణ , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలములలో , దక్షిణాయన , ఉత్తరాయణ పుణ్య కాలాలలోను , మహాలయ పితృ పక్షం లోనూ , మరియు తీర్థ క్షేత్రములకు వెళ్ళినపుడు…
ఒకేసారి , ఒకే రోజు రెండు కారణాలవలన రెండు సార్లు తర్పణము ఇవ్వరాదు..ఒకే తర్పణము ఇవ్వాలి..ఉదాహరణకి ,

అమావాశ్య , సంక్రమణము ఒకే రోజు వస్తే , అమావాశ్య తర్పణము మాత్రము ఇవ్వాలి.
దక్షిణాయన / ఉత్తరాయణ పుణ్య కాలాలు అమావాశ్య రోజున వస్తే , ఆయన పుణ్యకాలం లో మాత్రము తర్పణము ఇవ్వాలి..

గ్రహణము , మరియు దక్షిణ / ఉత్తర పుణ్యకాలాలు ఒకరోజే వస్తే , గ్రహణ నిమిత్తం మాత్రం తర్పణం ఇవ్వాలి. ఉత్తరాయణ పుణ్య కాలము , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాలు ఒకే రోజు వస్తే , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాల తర్పణం ఇవ్వాలి..

చంద్ర గ్రహణమైతే గ్రహణ మధ్య కాలము దాటిన తర్వాత , సూర్య గ్రహణమైతే గ్రహణ మధ్య కాలానికన్నా ముందుగాను , తర్పణము ఇవ్వాలి.

సంక్రమణమైతే , పుణ్యకాలంలో ఇవ్వాలి..

విధానము

ప్రాగగ్రాన్ దర్భాన్ ఆస్తీర్య | తేషు దక్షిణాగ్రౌ ద్వౌ కూర్చౌ నిధాయ | ( మూడు దర్భలను బొమ్మలో చూపినట్టు , కొనలు తూర్పుకు వచ్చేలా ఒకదానికొకటి సమాంతరం గా పరచాలి… వాటిపైన రెండు కూర్చ లను , దక్షిణానికి కొనలు వచ్చునట్లు పరచాలి.)

కూర్చలను చెయ్యడానికి : రెండేసి దర్భలను తీసుకుని పైనుంచి ( కొనలనుంచి ) ఆరంగుళాలు వదలి మడవాలి, మడిచినచోట ఒక వృత్తం లాగా చేసి, రెండు సార్లు కొనలను దర్భల చుట్టూ తిప్పి వృత్తం లోనించీ అవతలికి తీసుకొని ముడి వెయ్యాలి. తర్వాత ,

ఆచమనము చేసి , పవిత్రము ధరించి , తర్వాత ప్రాణాయామము చేసి , సంకల్పము ఇలా చెప్పాలి

సంకల్పము : ( దేశకాలౌ సంకీర్త్య ) శ్రీ గోవింద గోవింద మహా విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య , అద్య బ్రహ్మణః , ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే ,

వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరత ఖండే , రామ క్షేత్రే , బౌద్దావతారే ,

అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన , ప్రభవాది షష్టి సంవత్సరణాం మధ్యే , శ్రీ ——నామ సంవత్సరే ( సంవత్సరం పేరు ) , —–ఆయనే ( ఆ కాలపు ఆయనము పేరు ) , ……..ఋతౌ ( ఋతువు పేరు ) , ….. మాసే ( మాసపు పేరు ) , …..పక్షే (శుక్ల .. లేక కృష్ణ పక్షము) ,….తిథౌ ( ఆనాటి తిథి పేరు )….. వాసరే ( ఆనాటి వారము.. భాను ( ఆది ) / ఇందు ( సోమ ) / భౌమ ( మంగళ ) / సౌమ్య ( బుధ ) / బృహస్పతి ( గురు ) / భార్గవ ( శుక్ర ) / స్థిర ( శని ) ….

విష్ణు నక్షత్ర , విష్ణుయోగ , విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ

ప్రాచీనావీతి ( జంధ్యము అపసవ్యము గా వేసుకొనవలెను..)
అస్మత్ పిత్ర్యాది ద్వాదశ పితౄణాం అక్షయ పుణ్య లోకావాప్త్యర్థం అమావాశ్యాయామ్ / సంక్రమణ పుణ్య కాలే…
( లేక , సూర్యోపరాగ / చంద్రోపరాగ / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచ మహాఽపర పక్షేషు అస్మిన్ పితృ పక్షే సకృన్మహాలయే / గంగా కావేరీ తీరే …..

ఇలా ఏది సందర్భోచితమో దాన్ని చెప్పి )

శ్రాద్ద ప్రతినిధి సద్యః తిల తర్పణమ్ ఆచరిష్యే…
( కింద చెప్పిన విధముగా , తిలోదకాలతో వారి వారి పేరు , గోత్రము , రూపము చెప్పి తర్పణము ఇవ్వాలి..)
మొదట పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.మనకు కుడి వైపున ఉన్న మొదటి కూర్చ లో తండ్రి వైపు పితృ దేవతలను , ఎడమ వైపున ఉన్న రెండో కూర్చలో మాతృ వర్గపు పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.
ప్రథమ కూర్చే ..
|| ఆయాత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే….——— గోత్రాన్. .. ———( తండ్రి పేరు ) , ………తాతయ్య పేరు , ……..ముత్తాత పేరు శర్మాణః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ , అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహాన్ ,

——– గోత్రాః , ——– , ———–, ———దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి |

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

పితృ , పితామహ , ప్రపితామహానాం , మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం |

( మొదటి కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

ద్వితీయ కూర్చే ( రెండవ కూర్చ పై )

|| ఆయాత మాతుః పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే..—— గోత్రాన్ ………( తల్లి యొక్క తండ్రి ) , ……….( తల్లి తాత ), ………( తల్లి ముత్తాత ) శర్మాణః …వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ | , ,
——– గోత్రాః ,……..( తల్లి యొక్క తల్లి ) , ………( తల్లి యొక్క అవ్వ ) , ………..( తల్లి యొక్క ముత్తవ్వ ) దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి ||
|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||
సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( రెండవ కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

పితృ వర్గము వారికి తర్పణము ఇచ్చునపుడు మొదటి కూర్చ పైనను , మాతృ వర్గము వారికి ఇచ్చేటప్పుడు రెండో కూర్చ పైనను నువ్వులు , నీళ్ళు పితృ తీర్థం లో వదలాలి.

ప్రథమ కూర్చే.. …పితృ వర్గ తర్పణం |
౧ పితృ తర్పణం (ఒక్కో మంత్రము చెప్పి ఒక్కోసారి , మొత్తం మూడు సార్లు తండ్రి కి … అలాగే మూడేసి సార్లు ఇవ్వ వలసిన మిగిలిన వారికి )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ||

——– గోత్రాన్. .. ———- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||
——- గోత్రాన్. .. ——— శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

——- గోత్రాన్. .. ———– శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨.. పితామహ తర్పణం ( మూడు సార్లు తాత కు)

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

——–గోత్రాన్. .. ——— శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

——- గోత్రాన్. .. ———- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

——— గోత్రాన్. .. ———- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

——– గోత్రాన్. .. ——– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

——- గోత్రాన్. .. ——- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

——- గోత్రాన్. .. ——– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౪. మాతృ తర్పణం ( మూడు సార్లు )

—— గోత్రాః , ——— దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతౄః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౫.. పితామహీ తర్పణం

——– గోత్రాః , ———దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౬. ప్రపితామహీ తర్పణం
——— గోత్రాః , ———– దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )
౭. ద్వితీయ కూర్చే మాతృ వర్గ తర్పణం. ( రెండవ కూర్చ పై )

మాతా మహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్~ఝాస్తేనోవంతు పితరో హవేషు ||

——–గోత్రాన్. .. ———- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

———- గోత్రాన్. .. ——— శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

———- గోత్రాన్. .. ——— శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౮.. మాతుః పితామహ తర్పణం ( మూడు సార్లు )
౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

——— గోత్రాన్. .. ———— శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||
———-గోత్రాన్. .. ————- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

———- గోత్రాన్. .. ———— శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౯. మాతుః ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

——–గోత్రాన్. .. ———– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

——— గోత్రాన్. .. ——– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

——– గోత్రాన్. .. ——- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౧౦ మాతామహీ తర్పణం ( మూడు సార్లు )
——— గోత్రాః , —— దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౧. మాతుః పితామహీ తర్పణం

——–గోత్రాః , ——- దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ మాతుః పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౨.. మాతుః ప్రపితామహీ తర్పణం
——- గోత్రాః , ——-దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ మాతుః ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

ద్వాదశ పితృ దేవతలకు మాత్రమే తర్పణం ఇస్తే , కింది మంత్రం చెప్పి ఒకసారి తిలోదకం ఇవ్వాలి…

జ్ఞాతాఽజ్ఞాత సర్వ కారుణ్య పితౄన్ స్వధా నమః తర్పయామి ||

|| ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ || తృప్యత తృప్యత తృప్యత |

సర్వే కారుణ్య పితృ దేవతలకు ఇస్తే కింది విధం గా , సజీవం గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి ఒక్కొక్క సారి మాత్రము తిలోదకం వదలాలి..

ఆత్మ పత్నీం( భార్య ) ——దేవీదామ్—–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ సుతమ్ ( పుత్రుడు ) ——శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ జ్యేష్ట భ్రాతరం ( అన్న ) ——శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ కనిష్ట భ్రాతరం ( తమ్ముడు ) ——శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ జ్యేష్ట పితృవ్యం ( పెదనాన్న ) ——శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( పెద్దమ్మ ) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ కనిష్ట పితృవ్యం ( చిన్నాన్న )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( పిన్ని ) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ మాతులం ( మేనమామ )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( మేనత్త) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
( ఇలా మేనమామలు , మేనత్తలు , పెద్దమ్మలు….ఎంతమంది కీర్తి శేషులై ఉంటే అంతమందికీ అదే శ్లోకం చెప్పి , వారి వారి పేర్లతో విడివిడి గా తర్పణం ఇవ్వాలి..)

అస్మద్దుహితరం ( కూతురు )—–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

ఆత్మ భగినీం ( అక్క / చెల్లెలు ) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ దౌహిత్రం ( కూతురు కొడుకు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ భాగినేయకం ( అక్క చెల్లెళ్ళ కొడుకు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ పితృ భగినీం ( మేనత్త) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
తద్భర్తారమ్( ఆమె భర్త )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతృ భగినీం ( తల్లి అక్క/చెల్లెలు) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
తద్భర్తారమ్( ఆమె భర్త )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జామాతరం ( అల్లుడు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ భావుకం ( బావ )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ స్నుషాం ( కోడలు) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ శ్వశురం ( పిల్లనిచ్చిన మామ )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ శ్వశ్రూః ( పిల్లనిచ్చిన అత్త) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ స్యాలకం ( భార్య సోదరులు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి
అస్మత్ సఖాయం ( ఆప్తులు / స్నేహితులు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మద్గురుం ( గురువు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మదాచార్యం ( ఆచార్యుడు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

పైన చెప్పిన వారిలో సజీవులుగా ఉన్నవారిని వదలి , మిగిలిన వారికి తర్పణం ఇవ్వాలి.

ఉపవీతి | ప్రదక్షిణం | ( జంధ్యము సవ్యం గా వేసుకొని కింది మంత్రం చెప్పుతూ , పరచిన దర్భల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి )

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

నమోవః పితరో రసాయ నమోవః పితరః శుష్మాయ నమోవః పితరో జీవాయ నమోవః పితరః స్వధాయై నమోవః పితరో మన్యవే నమోవః పితరో ఘోరాయ పితరో నమో వో య ఏతస్మిన్ లోకేస్థ యుష్మాగ్ స్తేఽను యేస్మిన్ లోకే మాం తే ను య ఏతస్మిన్ లోకేస్థ యూ యం తేషాం వసిష్ఠా భూయాస్త యేస్మిన్ లోకేహం తేషాం వసిష్ఠో భూయాసం ||

తనచుట్టూ తాను ప్రదక్షిణం

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

పాపోఽహం పాప కర్మోఽహం పాపాత్మా పాప సంభవః
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పితృదేవతాః..

|| చతుస్సాగర పర్యంతం … …. …. అభివాదయే || ( ప్రవర చెప్పి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి )

పిత్రాదిభ్యో నమః |

ప్రాచీనావీతి | ఉద్వాసనం ( అపసవ్యం గా జంధ్యం వేసుకొని కింది మంత్రం చెప్పి కూర్చలను విప్పి పక్కన పెట్టాలి
|| ఉత్తిష్ఠత పితర ప్రేత శూరా యమస్య పంథా మను వేతా పురాణం | ధత్తాదస్మాసు ద్రవిణం యచ్చ భద్రం ప్రణో బ్రూతాత్ భాగధాన్దేవతాసు ||

|| పరేత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
అథా పితౄంథ్సువిదత్రాగ్ం అపీత యమేనయే సధమాదం మదంతి ||

అస్మాత్ కూర్చాత్ మమ పితృ , పితామహ , ప్రపితామహాన్ , మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ యథా స్థానం ప్రతిష్ఠాపయామి |
ద్వితీయ కూర్చాత్ సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ యథా స్థానం ప్రతిష్ఠాపయామి | శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

| కూర్చ ద్వయం విస్రస్య |

నివీతి |( జంధ్యము మాల లాగా వేసుకోవాలి ) తర్వాత , గోత్రాలు , సంబంధాలు తెలియని బంధువుల కొరకు తర్పణం ఇవ్వాలి..

యేషాం న మాతా న పితా న బంధుః నాన్య గోత్రిణః | తే సర్వే తృప్తిమాయాంతు మయోత్సృష్ట్యైః కుశొదకైః || ఇతి తిలోదకం నినీయ |

ఈ కింది శ్లోకము చెప్పి , జంధ్యాన్ని కాని నీటితో తడిపి , ( జంధ్యపు ముడిని ) ఆ నీటిని నేల పైకి పిండాలి..

|| యేకేచాస్మత్ కులే జాతాః అపుత్రా గోత్రిణోమృతాః
తే గృహ్యంతు మయా దత్తం వస్త్ర ( సూత్ర ) నిష్పీడనోదకం ||

దర్భాన్ విసృజ్య || పవిత్రం విసృజ్య || ఉపవీతి | దర్భలను , పవిత్రాన్ని విప్పి తీసెయ్యాలి , జంధ్యాన్ని సవ్యం గా వేసుకోవాలి )

తర్పణము అయ్యాక ,ఇది చెప్పాలి

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో తర్పణ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన | యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||

అనేన మయా అమావాస్యా పుణ్యకాలే / సూర్యోపరాగే / చంద్రోపరాగే / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / పితృ పక్షే సకృన్మహాలయే / తీర్థ క్షేత్రే కృతేన తిల తర్పణేన శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రియతాం ప్రీతో వరదో భవతు||

అని చెప్పి , అరచేతిలో నీళ్ళు వేసుకొని వదలాలి.

మధ్యే మంత్ర , తంత్ర , స్వర , వర్ణ , ధ్యాన , నేమ , లోప దోష పరిహారార్థం నామ త్రయ మంత్ర జపమ్ కరిష్యే |

అచ్యుతాయ నమః | అనంతాయ నమః | గోవిందాయ నమః || ( రెండు సార్లు పలకాలి )

అచ్యుతానంత గోవిందేభ్యో నమః |

|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |

కరోమి యద్యద్ సకలం పరస్మై శ్రీమన్నారాయణేతి సమర్పయామి ||

అని చెప్పి నీరు వదలాలి

శ్రీ కృష్ణార్పణమస్తు

పైన చెప్పినంత విస్తారముగా చేయుటకు సమయము లేనిచో , క్లుప్తముగా కిందివిధముగా చెయ్య వచ్చును..ఇది కేవలం విధి లేని పరిస్థితి లో మాత్రమే…ఎందుకంటే, శ్రాద్ధానికి , తర్పణానికి శ్రద్ధ ముఖ్యము.

ఈ శ్లోకము చెప్పి , మూడు సార్లు తిలోదకాలు ఇవ్వవలెను

|| ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృ మానవాః |

తృప్యంతు పితరః సర్వే మాతృ మాతా మహాదయః |

అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |

ఆ బ్రహ్మ భువనాల్లోకాత్ ఇదమస్తు తిలోదకం ||

ఆచమ్య || బ్రహ్మ యజ్ఞాదికం చరేత్ || యథా శక్తి బ్రాహ్మణాన్ భోజయేత్ || ఓం తత్ సత్

( ఆచమనం చేసి , శక్తి ఉన్నవారు బ్రహ్మ యజ్ఞం చెయ్యాలి … బ్రాహ్మణులకు భోజనం పెట్టవచ్చు )
( బ్రహ్మ యజ్ఞం విధి ప్రత్యేకముగా వ్రాయుచున్నాను )

ఇతి ఆబ్దిక / దర్శ శ్రాద్ధ విధిః తర్పణ విధిశ్చ

This Brahmana Bhavan has been conceptualized and established during the year 2013 for the sole purpose of providing Boarding & Lodging for only Brahmins who visit Hyderabad on various issues, from quite far off places. All our initiations are obviously based on the welfare and development of our serene Brahmin Community. Here, there are no Luxury rooms or AC rooms available, We will provide only traditional meals to Brahmins those who are visiting Brahmana Bhavan with Free of cost but it is needed to intimate us, at least one day before.
No charges for Meals or accommodation.
Member ship fee is Rs.1000 (One Thousand Only) is mandatory, valid for 10 Years. Please Note : We allow Only Brahmins. Please send your tour schedule at least 10 days before.

                    GiriPrasad Sarma KALLE (కళ్లె)
                     Founder President