welcome to BRAHMIN WELFARE BHAVAN
బాగా గమనించండి : గిరి ప్రసాద్ శర్మ ఎవరు అయన ఆలోచన ఏమిటి : ... ఎవరైతే జీవితంలో సంపూర్ణ0గా ఓడిపోయి ఇబ్బందుల్లో ఉంది ఎవరో ఒకరు నన్ను ఆదుకోవాలి అని అనుకున్నపుడు వారికీ ఉపయోగ పడే మనిషి గిరి ప్రసాద్ శర్మ అవ్వాలని కోరుకుంటాడు .. అంతేకాని కడుపు నిండిన వారికి ఫలహారం పెట్టె రకం కాదు .. అర్థం చేసుకుంటే బాగుంటుంది.
ఏదైనా సహాయం కావాలి అన్నపుడు మీరు పంపాల్సిన వివరాలు పంపిన తర్వాత అప్పుడు మీరు అడిగేది మాకు నచ్చితే ఎలా సహాయ పడగలమో తెలియ చేస్తాము .. Please send applicants (your) Name : Surname : Age Gotram Adress Profession Concerned Brahmana Sangham Name, R U Brahmana Bhavan Member ? If Yes Member ship number ? when your recent visit to Brahmana Bhavan ? Date Introducer Name Beneficiary Name Age Profession Address : What she / He required ? Problem ? Financial Position ? Send all these information to our Whats app Number :
దూర ప్రాంతాల వారు మెసేజి ద్వారా విషయాలు తెలుసుకుని రావచ్చు , కాని హైదరాబాద్ లో ఉన్న వారు నేరుగా వచ్చి మాతో మీ సమస్యల పట్ల సంప్రదించ వచ్చు
333

Giri Prasad Sarma....

Founder President 


గిరి ప్రసాద్ శర్మ అను నేను మనసా వాచా కర్మణా బ్రాహ్మణ సేవ చేయుటకు మాత్రమే యొక్క మన సంక్షేమ భవనాన్ని 2014లో ప్రారంభించాను. మొట్ట మొదటి నుంచి ఈరోజు వరకు ప్రధాన సంకల్పం ఏదైతే ఉందో హైదరాబాద్ కు వచ్చే బ్రాహ్మణులకు ఉచితంగా వసతి భోజనం సౌకర్యం కల్పించడం అది నిరాటంకంగా జరుగుతూనే ఉంది. అలాగే ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నో రకాలైన బ్రాహ్మణ సేవలను ప్రత్యక్షంగా చేస్తూనే ఉన్నాం కాకపోతే మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను మేము లిఖితపూర్వకంగా తీసుకున్న తర్వాతనే వాటిని పరిశీలించి అవసరమైన వాటిని స్వీకరించి సమస్యల పరిష్కారానికి మా శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నాం.

అయితే కొంతమంది వారి భావన ఎలా ఉందంటే ఉచితంగా ఎందుకు చేస్తారు ఏదో లాభం ఉండే కదా అనే ఇత్యాది ప్రశ్నలు మనసులో ఉంచుకుని చెడు భావనతో చెడు అభిప్రాయాలతో మా ముందుకు వచ్చి నటన ప్రదర్శిస్తారు అప్పుడు మా స్పందన రివర్స్ గా ఉండడం వల్ల వారి మనోభావాలు దెబ్బతింటాయి అందువల్ల మాకు శత్రువులు లేకపోయినప్పటికీ మా పట్ల సేవల విషయంలో సరైన స్పందన రానివారు మా పై ద్వేషం ప్రదర్శిస్తూ ఉంటారు వారిని మేము ఎలాంటి పరిస్థితుల్లో పట్టించుకో ము ఆ పోయి మాకంతా సమయం కూడా ఉండదు ఉదయం 5 గంటల నుండి దూరప్రాంతాల నుంచి ఎవరైనా వస్తారా వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి వారు ఎలాంటి పనులు మీద వస్తున్నారు ఎలా సహకరించాలి అనే ఆలోచన తప్ప ఏమాత్రం స్వలాభాపేక్ష గాని స్వార్థము గాని కల్మషం గాని రాజకీయం గాని మా మనసులో మా దరిదాపుల్లో కూడా ఉండవు కానీ నీ దృష్టి తో మమ్ములను ఏదో పరీక్షించాలని కావాలని ఇబ్బంది పెట్టాలని వచ్చేవారికి కచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది కనుక ఇలాంటి విషయాల్లో వీలైనంతవరకు మేము జాగ్రత్తగా ఉంటాం ఆపై మధ్యాహ్నం సమయానికి రాత్రి సమయానికి ఎంత మంది బ్రాహ్మణులు ఉంటే అంతమందికి కూడా భోజనం వసతి ఇ సౌకర్యములు సంపూర్ణంగా ఉచితంగా అందజేస్తాం మా సేవలకు ఎలాంటి రుసుములు లేవు ఎవరైనా చెప్పినా అది అబద్దమే కానీ నీ జీవిత సభ్యత్వం రూపాయలు 1000 మాత్రం చెల్లించాల్సి వస్తుంది ఇది జీవితంలో ఒకసారి చెల్లింపు మాత్రమే ఈ సభ్యత్వానికి భోజన వసతికి ఎలాంటి సంబంధమూ లేదు తదుపరి ఎవరైనా జీవిత సభ్యత్వం కూడా కట్టలేము అనుకుంటే వారు మాకు ఒక లేఖ రాసి ఇవ్వాలి మేము మీ వద్దకు విజ్ఞాపన చేయుటకు వచ్చాము అందుకని మేము అంత జీవిత సభ్యత్వం కట్టలేము అని వ్రాస్తే వారికి జీవిత సభ్యత్వ రుసుము కూడా లేకుండా మా సేవలు అందిస్తున్నాం ఇది గ్రహించక కొంతమంది కేవలం జీవిత సభ్యత్వం వారికి ముఖ్యం అనే లాగా కూడా ప్రచారం చేస్తూ వారి ఆనందాన్ని పొందుతున్నారు దానికి మేము ఏమీ చేయలేం ఆ తర్వాత మన దగ్గర ప్రతిరోజు హోమియోపతి ఆసుపత్రి నడుస్తుంది ఎటువంటి రుసుములు లేవు మందులు కూడా ఉచితంగా ఇస్తాం తదుపరి మన వద్ద మహిళా హాస్టల్ నడుస్తున్నది ఇక్కడ  చేరిన మహిళలకు మంచి భోజనం ఇవ్వడము తదుపరి వారికి సంపూర్ణమైన ప్రొటెక్షన్ ఇవ్వడం తదుపరి ఇతర హాస్టల్ లో కూడా లేనట్లుగా వారి తల్లిదండ్రులు వచ్చినపుడు వారికి కూడా ఉచితంగానే భోజన వసతి కల్పిస్తున్నాం తదుపరి ఇక్కడ అ మహిళా మండలి కూడా ఉన్నది మహిళలకు వివిధ రంగాలలో శిక్షణ ఇవ్వడం ఆపై ప్రతి నెల ఒక సమావేశం నిర్వహించి వారికి వివిధ అంశాలలో నైపుణ్యత కల్పించడం చేస్తున్నాం అత్యవసర పరిస్థితుల్లో బ్రాహ్మణ మహిళల గాని కుటుంబ సభ్యులు గానీ ప్రమాదానికి లోనైతే వారికి సపోర్ట్ గా ఉండడానికి ఒక మహిళ టీం కూడా తయారు చేశాం ఇలాంటి ఇ ఎన్నో సేవా పథకాలను మనం నిత్యము ప్రత్యక్ష సేవల ద్వారా అందిస్తున్నాం కనుక ఎవరైనా నా మా సేవలను పొందవచ్చు మా యొక్క సంపూర్ణ వివరాలు మన వెబ్ సైట్ లో ఉన్నవి పథకాలకు సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాల కోసం ఉపాధి కోసం సేవల కోసం ఇంకా ఇతరత్రా ఏదైనా అవసరాల కోసం మాకు మీరు నేరుగా సంప్రదించవచ్చు కనుక బ్రాహ్మణ భవన్ ఎప్పటికీ సమస్త బ్రాహ్మణ లోకానికి అందుబాటులో ఉన్న ఏకైక 24 గంటల సంక్షేమ భవన్ గుర్తించి మీరు మా సేవలను అందుకో వలసిందిగా ప్రార్థన మా తరఫున ఎటువంటి ఆర్థిక లావాదేవీలు గాని కుటిలమైన స్కీములు ఉండవు ఎవరైనా చెప్పినా వారి నెంబరు వారి పేరు తీసుకుని వారు చెప్పిన అంశానికి తగిన సాక్ష్యాధారాలు తీసుకుని మా ముందు నిలబెట్టాలని మా ప్రార్థ.న.