PENSION

భారత బ్రాహ్మణ సంస్థాన్ ద్వారా ఎంతోమంది నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో రకాలైన లాభాలు పొందుతూ ఉంటారు
అందులో నెల నెల పెన్షన్ కూడా ఇవ్వబడుతుంది : అందులో మీరు కూడా పెన్షన్ ఇచ్చుటకు ముందుకు రావచ్చు :
పెన్షన్ అనేది వారి పరిస్థితిని బట్టి మేమె నిర్ణయిస్తాము : వారి వివరాలు ప్రతి ఒక్క దాతకు చెప్తాము : మీరు వారితో మాట్లాడి మీరు అనుకున్న నెలలో వారికి పెన్షన్ పంపవచ్చు. గత ఏడాది కంటే ఈ ఏడాది కొంత వాల్యూమ్ పెంచాలని అనుకుంటున్నాము.
సుమారు వందమంది నుండి 250 మందికి పెన్షన్ అందేలా చూడాలని మా తాపత్రయము. ఎవరు కూడా మా సంస్థకు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన పనిలేదు .. నేరుగా దాతల నుండి వృధాప్య పరిస్థితి లో ఉన్న మరియు వితంతువులుగా మరి ఇబ్బంది పడుతున్న సోదరీమణుల గురించి మాత్రమే ఈ పథకం :
నెలసరి పెన్షన్ కోసం దరఖాస్తులు ఈ ఏడు చాలానే వచ్చాయి .. ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఇలా ఇవ్వచ్చు :
ముందు మీ పేరు గోత్రము , ఎవరి పేరుమీద ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది తెలియ చెయ్యాలి
ఒకరు ఒక నెల ఒక 1000 గాని లేదా 2000 గాని లేదా 5000 వేలు గాని
లేదా మీకు తోచినన్ని నెలలు కూడా పెన్షన్ మీరే ఇవ్వచ్చు
కనుక మీరు ఇవ్వాలి అనుకుంటే ఏ నెలకు ఇవ్వగలరు ? మరియు ఎంత ఇవ్వగలరు అనే విషయంన్ని మాకు వాట్సాప్ మెసేజి చెయ్యవచ్చు. పేర్లు బహిరంగంగా తెలియ చేస్తాము వద్దు అనుకుంటే మీ ప్రవర లోని ఒక ఋషి పేరు తెలియ చేస్తే అయన పేరుమీద పెన్షన్ ఇవ్వచ్చు . ధన్యవాదములు :

ఈ వేదిక ఏర్పాటు చేసింది
భారత బ్రాహ్మణ సంస్థాన్ ద్వారా బ్రాహ్మణ సంక్షేమ భవన్

వ్యవస్థాపకులు : గిరి ప్రసాద్ శర్మ
9701609689


అంతా పారదర్శకమే
No recommendations 
No Politics 
Please . 

దయచేసి గమనించండి : ఎందరో మహానుభావులు , అందరికీ వందనము. బ్రాహ్మణ సంక్షేమ భవన్ ద్వారా ఇబ్బందుల్లో ఉన్న పేద బ్రాహ్మణులకు నేరుగా సహాయం అందించే దిశగా బ్రాహ్మణ భవన్ గత ఆరు ఏళ్లుగా ముందంజ లో ఉన్నది., తర్వాత ఈ 2020 నుండి ప్రతి రోజు మా ద్వారా ఎంతమందికి ఎన్ని రకాల సహాయం అందిందో తెలియ చెయ్యడానికి ఈ యొక్క పేజీని కేటాయించాము.
మీరు ఒకరికి పెన్షన్ ఇవ్వచ్చు , ఏడాదికి ఒకనెల ఇవ్వచ్చు , లేదా తోచినన్ని నెలలు ఇవ్వచ్చు., లేదా మొత్తం సంవత్సరం మీరొక్కరే రూ 1000 చొప్పున ఇవ్వచ్చు. ఇక్కడ లబ్ధిదారుల వివరాలు ఉంచుతాము. మీరు వారితో మాట్లాడి నేరుగా సహాయం చెయ్యవచు. మీ వివరాలు అందిస్తే ఇక్కడ మీరు చేసిన సహాయం లిస్ట్ లో ఉంచుతాము. దయచేసి గుప్త దానాలు / సహాయాలు చెయ్యకండి . మీ పేరు రాయడం ఇష్టం లేకపోతె మీ ప్రవర లోని ఋషులు లేదా మీ ఇంట్లో ఎవరి పేరు మీద ఐన సహాయం ఇవ్వచ్చు. కానీ ఒక లెక్క కోసం మీరు సహాయం చేసిన వివరాలు పంపాలి. ఇదంతా పారదర్శకమే .. నో సీక్రెట్స్ .. నో రాజకీయంస్ .. నిజాయితీగా సేవ చేసే మనసుంటే రండి. గొప్పలు, ఫోటోలు , సన్మానాలు కావాలి అంటే మేము చేయలేము. ప్రజలు మనలను గుర్తించి మనలను గౌరవించాలి. అప్పటి దాకా మన ప్రయాణం మనం చెయ్యాలి.

మనం ఒక వాట్సాప్ గ్రూపు కూడా పెట్టినాము : మీరు అందులో చేరవచ్చు : చేరి మీ సహాయాన్ని ప్రకటించ వచ్చు :

 

This Brahmana Bhavan has been conceptualized and established during the year 2013 for the sole purpose of providing Boarding & Lodging for only Brahmins who visit Hyderabad on various issues, from quite far off places. All our initiations are obviously based on the welfare and development of our serene Brahmin Community. Here, there are no Luxury rooms or AC rooms available, We will provide only traditional meals to Brahmins those who are visiting Brahmana Bhavan with Free of cost but it is needed to intimate us, at least one day before.
No charges for Meals or accommodation.
Member ship fee is Rs.1000 (One Thousand Only) is mandatory, valid for 10 Years. Please Note : We allow Only Brahmins. Please send your tour schedule at least 10 days before.

                    GiriPrasad Sarma KALLE (కళ్లె)
                     Founder President