నా పేరు గబ్బిట శ్రీగిరి. దర్భా వారి ఆడపడుచుని. మాతామహులు యనమండ్ర వారు. మాది గౌతమస గోత్రం. నివాసం విజయవాడ. నేను సంగీతం హైదరాబాద్ లో జగన్నాధం గారి వద్ద మొదలు పెట్టాను. విజయవాడ వచ్చాక శ్రీమతి విష్ణుభొట్ల లలిత గారి వద్ద ఆ తరువాత వారి కుమార్తె ప్రముఖ విద్వన్మణి విష్ణుభొట్ల సిస్టర్స్ లో పెద్దవారు శ్రీమతి సరస్వతి గారి వద్ద శిక్షభ్యాసం కొనసాగించి వారి ప్రోత్సాహంతో సర్టిఫికెట్ డిప్లొమా పూర్తిచేసాను. అలాగే కొంత కాలం హైదరాబాద్ లో ఉన్నప్పుడు డిప్లొమా కోర్సుకై పసుమర్తి పద్మావతి గారి వద్ద కూడా నేర్చుకున్నాను. పెళ్లయ్యాక సేలం కోయంబత్తూరు లో స్థిరపడ్డాం. కోయంబత్తూరు లో శివరామకృష్ణ గారి శిక్షణలో సంగీతం లో MA పూర్తి చేశాను. ఇప్పుడు ప్రస్తుతం ట్రాన్స్ఫర్ మీద విజయవాడలో స్థిరపడ్డాము. మేము విజయవాడ వచ్చిన వారంలోనే గిరిప్రసాద్ గారు వారి గ్రూప్ గురించి తెలియజేయడం నన్ను ఈ గ్రూప్ లో జాయిన్ చేయడం నా సంగీత ప్రయాణానికి సోపానం గా భావించి సంతోషించాను. కొంతకాలంగా పరిశీలిస్తున్న. నా ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిలువెత్తు రూపంలా కనిపించింది వీరు (గిరి ప్రసాద్ గారు) చేసే కార్యక్రమాలు. అందరికి కళలను ప్రదర్శించుకునే హక్కు ఉంది. కొంతమంది బయట పెట్టడానికి బిడియం ఉంటుంది, మోహమాటపడతారు, సంకోచిస్తారు. అటువంటి సంకోచలేమి పెట్టుకోవద్దు, మీలో టాలెంట్ ఉంది, ఇదేమీ స్టేజి కాదు, మన లాగానే గృహిణులున్న చిన్న ప్రపంచం అన్నట్లు హారతి పాటల గ్రూప్, సరిగమ గ్రూప్, ఆర్ట్ గ్రూప్ ( కళలకు), create చేశా. చిన్నప్పుడు అక్కడ పాడలి ఇక్కడ పాడలి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఉబలాట పడి, కానీ దానిని నెరవేర్చుకోలేని స్థితిలో ఉన్నవారికి కేవలం ధైర్యం నింపితే వారు కనిన కలలు ఇక్కడ సార్థకత చేసుకుంటారనే ఉద్దేశ్యంతో ఈ గ్రూప్స్ స్టార్ట్ చేసాను. ఆ గ్రూప్ ద్వారా వచ్చిన ధైర్యంతో ఇద్దరు కళాకారులు ఇప్పుడు బయట కూడా పాడడానికి సిద్ధం అయ్యారు కూడా. ఇదిలా కొనసాగుతుండగా ఈ గ్రూప్ పరిచయం అయింది. నా ఆలోచనకు పది రెట్లు కాదు వంద రెట్లు ముందుంది. హాట్స్ ఆఫ్ to the గ్రూప్ అడ్మిన్ గిరి ప్రసాద్ గారు. మీ గ్రూప్ లో కి రావడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నా. నేను ఏదైనా బాగా పరిశీలిస్తే తప్ప మాట్లాడను. అందుకే గ్రూప్ కి వచ్చి ఇన్నాళ్ల తరువాత చెబుతున్నా, అన్యథా భావించకండి.🙏🏻 ధన్యవాదాలు.

జాతీయ బ్రాహ్మణ మహిళా సమాఖ్య సదస్సు – 2019
తేదీ : 4 ఆగస్ట్ , 2019
వేదిక : హోటల్ అభినంద్ గ్రాండ్ , ఏసీ

ఘన్ శ్యామ్ మందిర్ పక్కన , కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగ
హైదరాబాద్ ఫోన్ : 6304921292

అజెండా :

  1. బ్రాహ్మణ మహిళల ఆత్మీయ కలయిక .. సందేశాలు , అనుభవాలను పంచుకోవచ్చు.
  2. ప్రతి శ్రవణం లో వచ్చే మొదటి ఆదివారం ఈ సభ నిర్వహించడం వల్ల బ్రాహ్మణ మహిళలను సాంప్రదాయ పద్దతిలో ఆడబిడ్డలుగా ఆహ్వానించి , బొట్టు తాంబూలం వడిబియ్యం పెట్టి వారిని గౌరవించడం భారత బ్రాహ్మణ సంస్థాన్ యొక్క ఆచారం , అలవాటు , లక్ష్యం.

ఆరోజు కార్యక్రమం :

వచ్చిన వారిలో పాటలు , వారి పిల్లలు గాని వారు గాని సాంప్రదాయ వాయిద్యాలు , నృత్యాలు చెయ్యవచ్చు (కాంపిటీషన్ కాదు)
… ఉదయం టీ , కాఫీ తో మొదలవుతుంది ..
అల్పాహారం ఉంటుంది
.. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి అదేహోటల్ లో రూములు ఉంటాయి ..
… ఉదయం 7 నుండి సాయంత్రం వరకు ఈ సదస్సు ఉంటుంది ….
…. మధ్యాహ్నం భోజనం ఉంటుంది.

మొత్తం కుటుంబ సభ్యులతో రావచ్చు ..
ఎటువంటి రుసుము ఉండదు.
ఎటువంటి రవాణా భత్యములు ఇవ్వబడవు
ఎటువంటి డబ్బు ఇవ్వబడదు.

వాలంటీర్లు ఉదయం 6 గంటలకే రావాల్సి ఉంటుంది

డ్రెస్ కోడ్ :

పింక్
రెడ్
గ్రీన్
వైట్
ఎల్లో

షరతులు :
అక్కడ అందరు సమానమే .. మర్యాద , సంస్కృతీ , సంప్రదాయాలు కల్గిన వారు మాత్రమే రావాలి.
ఏ విషయానికి అతిగా ప్రవర్తించరాదు , పెద్దలను ఇబ్బంది పెట్టరాదు.
పిల్లలు చాల గోల చేస్తే పక్కకు తీసుకు వెళ్ళాలి ..
డిగ్నిటీ గా సభ నడిపి వచ్చిన మహిళలకు సంతోషం కల్గించాలి

పసుపు , కుంకుమ, ఇతర దానాలు లేదా తాంబూలములు ఇచ్చుకుంటాము అంటే సంతోషంగా ఇచ్చుకోవచ్చు, మాకు అభ్యంతరము లేదు

శ్రావణ మాసం మొదటి ఆదివారాన్ని మనం బ్రాహ్మణ మహిళా దినోత్సవం గ జరుపుకుని వచ్చే శుక్రవారం నుండి వరలక్ష్మి అమ్మవారి వ్రతములు చేసుకుని సుఖ శాంతులతో అష్టైశ్వర్యములతో ఇంటిల్లిపాది తృప్తిగా జీవితం గడపాలన్నది మా ఆకాంక్ష.

సోదరుడు
గిరి

WhatsApp chat