BRAHMIN WELFARE BHAVAN

204 SVS PAPAIAH ESTATES, POST OFFICE BUILDING, CHIKKADAPALLY, HYDERABAD 500020 - PH : 6304921292

Proudly powered by WordPress | Theme: Rabin Resume Vcard by BuyProTheme.

About Us….

PRESENT PROGRAMS :

OCTOBER 20TH : VIJAYAWADA 7AM TO 1PM

ఫ్యామిలీతో రావాలి అనుకునే వారు రావచ్చు.

మా మహిళా సమాఖ్య తరపున విజయవాడ అమ్మవారి దర్శనానికి వెల్తున్నాము…అక్కడ భక్తి పాటల కార్యక్రమం ఉంటుంది…. తప్పకుండా అందరూ రావచ్చు.

మన బ్రాహ్మణ మహిళల ఔన్నత్యాన్ని చాటే మరో కార్యక్రమం ఇది…

$$$$$$$$$$$$$
ఈ 20 న బ్రాహ్మణ మహిళా సమాఖ్య తరపున విజయవాడ లో మనం మంచి కార్యక్రమం పెట్టుకున్నాము ..
19 రాత్రికే చేరుకోవాలి .. లేదా 20 ఉదయం 7 గంటలకు దేవాలయం క్రింద లిఫ్ట్ వద్దకు చేరుకోవాలి ..

19 మధ్యాహ్నం 2 కు బయల్దేరితే సాయంత్రం విజయ వాడ లో చాల ప్రాంతాలు చూడవచ్చు
19 రాత్రి బయల్దేరితే బ్రాహ్మణ భవన్ లో పడుకుని ఉదయం లేచి తయారు అయ్యి రావచ్చు ..
20 ఉదయం బయల్దేరితే మీరు రాలేరు..

కనుక మీ ఆలోచన

రైల్ రిజర్వేషన్ కోసం శ్రీమతి చంద్రిక ను
అలాగే కార్లో రావాలి అనుకుంటే రూ 400 (అప్) పే చేసి రావచ్చు
ఒక్కో కారులో కేవలం 6 మంది మాత్రమే పడుతారు
నేరుగా మన బ్రాహ్మణ భావన్ దగ్గర దింపుతారు

వివరాలకు శ్రీమతి దుర్గా రాణీ 6304921292 గారిని సంప్రదించండి

NOVEMBER 10TH 2019 : HEALTH CARDS MEETING : 7 AM TO 1PM

ఈ హెల్త్ కార్డు ఎవరికి ? :

  1. పురోహితులు లేదా అర్చకులు అయ్యి ఉంది ఆదాయం సరిగా లేనివారు
  2. చిరు ఉద్యోగం , చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్న బ్రాహ్మణ సోదరులు , సోదరీమణులు
  3. మా కుటుంబానికి సరి ఐన సపోర్ట్ లేదు అనుకునే బ్రాహ్మణ కుటుంబాలు

మొత్తం మ్యాటర్ చదివి అప్పుడు అర్థం కాకా పొతే మాత్రమే మెసేజి చెయ్యండి ..
ఫార్వార్డ్ చేసే ముందు మీకు అర్థం అయ్యిందా లేదా అనేది ఆలోచించండి ..

కాల్స్ చేయ్యరాదు… ఫోన్ ఎత్తము…. ఓన్లీ గ్రూపులో చెరి విషయాలు తెలుసుకోవాలి…

Age limit : 18 Years to 55 ONLY

ఏ ప్రాంతం వారైనా తీసుకోవచ్చు – ఇది ఆంధ్రాకా ? తెలంగాణానా అని తేడా ఏమి లేదు ..
ప్రపంచం లో ఎవరైనా ఈ పాలసీ / కార్డు పొందవచ్చు ..
బ్రాహ్మణులూ అయ్యి ఉండాలి ..

మీ పత్రములు ఫొటొలు తీసుకుని నేరుగా నవంబర్ 10 ఉదయం 7గంటలకు హాజరు అవ్వాలి
దరఖాస్తు దారులు తీసుకు రావాల్సినవి :
ఎవరెవరు కుటుంబంలో ఈ కార్డు ద్వారా లబ్ది పొందాలి అనుకుంటారో వారు అందరివీ కావాలి

ఆధార్ కార్డు – అందరివీ
ఓటర్ కార్డు – ఉన్నవారివి
పాన్ కార్డు – హెల్త్ కార్డు తీసుకునే వారిది
ఫోటోలు 4 – అందరివీ నాలుగు కావాలి
పుట్టిన తేదీ ఉన్న చదువు సర్టిఫికెట్ – హెల్త్ కార్డు తీసుకునే వారిది
.

అక్కడ మేము ప్రత్యేకంగా ఇచ్చిన దరఖాస్తు నింపాలి .. .. సభలో నిశబ్ధంగా ఉండాలి

అన్ని విషయాలు అక్కడ సభలో చెబుతారు… చెప్పినది వినాలి

చెప్పిన విషయాన్ని వినకుండా అదే విషయాన్ని తిరిగి అడగరాదు.

మా సమయం వృధా చేయ్యరాదు. … స్టేజీ వద్దకు రాకూడదు.

అన్ని ప్రాంతాల వారు అన్ని శాఖల వారు అర్హులే….

ఈ పాలసీలు వివిధ రకాలుగా ఉంటాయి…

వయసు…ఆరోగ్యం….ఇతర వివరాలను బట్టి ఉంటాయి…

విజయవాడ లొ డిసెంబర్ లొ ఇదే సదస్సుఉంటుంది…

మేము రాలెము అనెవారికి ఎమి చెయ్యలెము… ఇది గిరి ప్రసాద్ గారు చెస్తున్న స్వచ్ఛంద సేవ.

సభకు వచ్చిన వారికి దరఖాస్తులు నింపి ఇచ్చిన తర్వాత సీరియల్ నంబర్ ఇవ్వబడును.

మొదటి విడతగా 500 మంది బ్రాహ్మణులకు ఈ హెల్త్ కార్డులు జారీ చేస్తాము.

స్త్రీ పురుషులు ఎవరైనా ఈ కార్డు పొందవచ్చు….

అన్ని కార్పొరేటు హాస్పిటల్స్ లొ ఈ కార్డు ద్వారా వైద్యం పొందవచ్చు….. షరతులు ఉంటాయి… సభలో చెప్తారు.

ఈ పాలసీల కోసం ఎవరికి ఎలాంటి రుసుము … లంచం ఇవ్వరాదు.

ఇది ఇంటిల్లిపాదికీ పనికి వస్తుంది…

పాలసీలకు అర్హులు కానివారు సైతం మన డాక్టర్ల వద్ద ఉచిత వైద్యం పొందవచ్చు.

చిరునామా ఇస్తున్నామూ.
నవంబర్ 10నాడు నేరుగా రావాలి. క్రింద వివరాలు చదవండి…

బ్రాహ్మణ స్నేహితులకు నమస్కారం ..

నాకు ఆదాయం సరిగా లేదు , ఉన్నా సరిపోవడం లేదు , ఆకస్మిక యాక్సిడెంట్ లేదా ప్రమాదం సంభవిస్తే నాకు ఇబ్బంది లక్షలు ఐతే అసలు భరించలేను , నాకు నా భార్య పిల్లలకోసం ఒక మంచి హెల్త్ కార్డు కావాలి అనుకునే వారు … నవంబర్ 10 ఆదివారం నాడు … హోటల్ అభినంద్ గ్రాండ్ లో సభ , హెల్త్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది ..

షరతులు :

  1. పురోహితులు లేదా అర్చకులు అయ్యి ఉంది ఆదాయం సరిగా లేనివారు
  2. చిరు ఉద్యోగం , చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్న బ్రాహ్మణ సోదరులు , సోదరీమణులు
  3. మా కుటుంబానికి సరి ఐన సపోర్ట్ లేదు అనుకునే బ్రాహ్మణ కుటుంబాలు

దీనికి అర్హులు …

ఎటువంటి డబ్బు కట్టాల్సిన పని లేదు , పోస్టల్ ఇన్సూరెన్స్ , స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు వారు నేరుగా మీ దరఖాస్తులు తీసుకుంటారు

హెల్త్ కార్డు ద్వారా కుటుంబ సభ్యులకు మీకు మంచి వైద్యం అందేలా దోహద పడుతుంది
బ్రాహ్మణ కుటుంబాల సంక్షేమం కొరకు ఈ ప్రత్యేక హెల్త్ కార్డు పాలసీలను ప్రవేశ పెడుతున్నది

భారత బ్రాహ్మణ సంస్థాన్
జాతీయ బ్రాహ్మణ మహిళా సమాఖ్య
బ్రాహ్మణ సంక్షేమ భవన్

గిరి ప్రసాద్ శర్మ
వ్యవస్థాపక అధ్యక్షులు
వాట్సాప్ నంబర్ : 9701609689

దరఖాస్తు దారులు తీసుకు రావాల్సినవి :
ఎవరెవరు కుటుంబంలో ఈ కార్డు ద్వారా లబ్ది పొందాలి అనుకుంటారో వారు అందరివీ కావాలి

ఆధార్ కార్డు – అందరివీ
ఓటర్ కార్డు – ఉన్నవారివి
పాన్ కార్డు – హెల్త్ కార్డు తీసుకునే వారిది
ఫోటోలు 4 – అందరివీ నాలుగు కావాలి
పుట్టిన తేదీ ఉన్న చదువు సర్టిఫికెట్ – హెల్త్ కార్డు తీసుకునే వారిది

వీనివల్ల ఉపయోగం మరియు సందేహాలు సభలో తీరుస్తారు

ఇవన్నీ ఒక కవర్లో పెట్టి తీసుకు వచ్చి సభలో రాగానే ఒక దరఖాస్తు ఇస్తారు అది వ్రాసి ఆ దరఖాస్తు కూడా ఈ పత్రాలు ఉన్న కవర్లో పెట్టి నేరుగా మా అడ్మిన్ లకు ఇవ్వాలి ..

ఇచ్చిన వారికి ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు .. ఎవరు ఎవరికీ ఎలాంటి రుసుము కట్టాల్సిన పనిలేదు ..

మీకు మీ కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల హెల్త్ కార్డు వస్తుంది .. అర్హత లేకపోతె రెండు లక్షల కార్డు వస్తుంది ..
దానికి కూడా అర్హత లేక పొతే

అన్ని కార్పొరేటు మరియు ప్రయివేటు ఆసుపత్రులలో వాడుకోవచ్చు

వయసు రీత్యా , చదువు రీత్యా , ఆదాయం రీత్యా కొన్ని షరతులు ఉన్నప్పటికీ అవి మీరు దరఖాస్తు చేసిన తర్వాత మీరు జత పరచిన పత్రాలను , మీరు నింపిన దరఖాస్తును బట్టి మీచేత మాట్లాడి హెల్త్ కార్డు జారీ చేస్తారు ..

ఇది ప్రభుత్వానికి గాని , బ్రాహ్మణ పరిషత్తుకు గాని ఎటువంటి సంబంధం లేనిది ..
ఇది కేవలం మన బ్రాహ్మణ మిత్రులు పడుతున్న ఇబ్బందులను చూసి నేను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం

ఈ గ్రూపు ఇన్సూరెన్స్ / హెల్త్ కార్డు కోసం వారికి కావాల్సిన మొత్తం మేమె భరిస్తాము ..

గిరి ప్రసాద్ శర్మ
9701609689 వాట్సాప్ మెసేజ్హి పెట్టవచ్చు .. కాల్స్ ఎత్తబడవు .. సమయం కుదరదు ..

వేదిక : హోటల్ అభినంద గ్రాండ్ , కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగా ,
హైదరాబాద్

తేదీ : 10 నవంబర్ 2019 … ఉదయం 7 నుండి మ 1 వరకు …
దరఖాస్తులు నింపి ఇచ్చిన తర్వాత మీకు సీరియల్ నంబర్ ఇస్తారు ..

నాలుగేసి ఐదేసి సీరియల్ నంబర్ ల కోసం కక్కుర్తి పడి భంగపడకండి ..

కార్డు కుటుంబ పెద్దకు మాత్రమే ఇస్తారు .. కుటుంబంలో అందరికి ఉపయోగ పడుతుంది ..
కుటుంబం సైజు ను బట్టి కార్డు అవకాశాలు ఉంటాయి ..

ఈ హెల్త్ కార్డు ఎవరికి ? :

  1. పురోహితులు లేదా అర్చకులు అయ్యి ఉంది ఆదాయం సరిగా లేనివారు
  2. చిరు ఉద్యోగం , చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్న బ్రాహ్మణ సోదరులు , సోదరీమణులు
  3. మా కుటుంబానికి సరి ఐన సపోర్ట్ లేదు అనుకునే బ్రాహ్మణ కుటుంబాలు

వయసు : 55 పైన ఉన్న వారు , 19 లోపు ఉన్న వారు అర్హులు కాదు

https://chat.whatsapp.com/FoCxoKj4Hm17ntgsQDfFZu

ఇది నిస్సహాయత , పేద రికంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలకు చేస్తున్న సేవ .. .
కళ్ళు నెత్తిన ఉండి , అహంకారము నిండి కేవలం ఎదో ప్రశ్నించాలి అనుకునే వెధవలకు కాదు ..

నీకు అంతలా చేతనైతే వచ్చి ఒక్కరోజు మా వద్ద పని చెయ్యి అప్పుడు తెలుస్తుంది ఏమిటి సేవ అంటే

మా చిరునామా , మా ఫోన్ నంబర్లు ఉన్నాయి …

బ్రాహ్మణ సంక్షేమ భవన్

హైదరాబాద్ : ప్రధాన కార్యాలయము : ఆశ్రమము

204 పాపయ్య ఎస్టేట్స్ , ఆంధ్ర బ్యాంకు ఎదురుగ , చిక్కడ పల్లి
హైదరాబాద్ – తెలంగాణ … ఫోన్ : 6304921292

విజయవాడ బ్రాంచ్ :
ఆంధ్ర ప్రభ కాలనీ చివరిలో , హైవే కు కలిసే కూడలిలో ,
మేడిప్లస్ మెడికల్ హాల్ పక్కకు ,
ఆంధ్ర ప్రభ కాలనీ
అజిత్ సింగ్ నగర్ , విజయవాడ
ఆంధ్ర ప్రదేశ్ – 9908496399

వాట్సాప్ : 9701609689

మీకు ఒక విజ్ఞప్తి
ఎవరైనా బ్రాహ్మణులు దీనావస్థలో మీకు కనపడితే వారిని మా వద్దకు పంపండి … వారిని అన్నివిధాల ఆదుకుందాం. అది మన కర్తవ్యం… రాబోయే వికారి నామ సంవత్సర0 లో అంతా శుభం జరగాలని… మనం అందరం అన్ని విషయాలలో కలసి ఉంటే మనపై ఎటువంటి దాడులు జరగవని అనుకోవచ్చు
హైదరాబాద్ కు ఏ ప్రాంతం నుండి బ్రాహ్మణులు వచ్చిన 24 గంటలు వారికి బస భోజనం సౌకర్యాలు కల్పించగలదు బ్రాహ్మణ భవన్
జీవిత కాలం శాశ్వత సభ్యత్వం రూ 1000 గా నిర్ణయించాము
బ్రాహ్మణ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యము ఉన్నది… పెద్దలకు ఆశ్రమ వసతి ఉన్నది …
బ్రాహ్మణ సమస్యలకు సమావేశాలకు ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ ఉన్నది
సహోదరులారా ….
ఒక్కపూట కూడా బ్రాహ్మణ భవన్ కు రాకుండా ఎక్కడో కూర్చుని ఊహాగానాలు చేసుకుని వాఖ్యలు చేయకండి… మేము ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకోసమూ బ్రాహ్మణ భవన్ నడపడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల లో ఏ బ్రాహ్మణ సంఘాన్ని మా పనులకోసం ఉపయోగించుకోము …
మాకు సుమారు 1. 5 లక్షల మంది ఉచిత సభ్యత్వ సభ్యులు ఉన్నారు .. వారందరికీ మన సమాచారం ఇవ్వడం మరియు మనందరి క్షేమం కొరడం మాత్రమే మేము కోరుతున్నాం.
మాకు కొట్లాది రూపాయల నిధులు వస్తున్నాయని భ్రమ పడుతున్నారు… అది వాస్తవం కాదు. కానీ మా 5 సంవత్సరాల ప్రత్యక్ష సేవల ద్వారా మాపై చాలా మందికి గల నమ్మకం మాకు ఏపని చేసినా ధన వస్తు రూపేణా సహకరించే వారు, నేరుగా వచ్చి పనులలో సహకరించే వారు ఉన్నారు. అది మా అదృష్టం. వారికి మా వినమ్ర ప్రాణామాలు.
జాతీయ స్థాయిలో మాకు బ్రాహ్మణ మహిళా సమాఖ్య ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో మహిళా సభ్యులు ఉన్నారు.
మేము అందరం కలసి వారికోసం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మొదటి ఆదివారమును “జాతీయ బ్రాహ్మణ మహిళా దినోత్సవం గా ” బ్రహ్మిన్ ఉమెన్స్ డే గా డికలెర్ చేసి ఉన్నాము … వికారి నామ సంవత్సరన్ లో కూడా ఆరోజు సుమారు రెండు వేల మందితో సమావేశం ఉంటుంది …
ప్రతి సంవత్సరం ఆ వేడుకలకు సోదరీమణులకు తాంబూలం చీర జాకెట్టు పెట్టి సన్మానించడం మా ఆనవాయితీ …
ప్రస్తుతానికి రెండు ఆశ్రమాలు ఒక అడ్మిన్ కార్యాలయం ఉన్నాయి.. ముగ్గురికి జీతాలు ఇస్తున్నాం.. వచ్చిన వారికి భోజనం పెడుతున్నాం. మితిమీరితే తన్ని పంపుతున్నాం.. మంచితనాన్ని గౌరవిస్తున్నాను… ఆత్మీయతా భావంతో కలుపుకు పోతున్నాం…
మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం ఉండాలని కోరుకుంటూ
గిరి ప్రసాద్ శర్మ
9701609689
శ్రీపతి దుర్గారాణి
6304921292
నిరంజనకుమార్ దేశాయ్
పట్నం శ్రీనివాస్
బోడి శ్రీనివాస్
గురు మూర్తి
మాలో కల్మషము రాజకీయము స్వార్ధము లేవు .. అవి లేనివారు మా అందువులు ఆత్మీయులు… ఉన్నవారిని కూడా భరిస్తాము.
శుభం భూయాత్

సంపూర్ణ పేదరికం లో ఉన్న బ్రాహ్మణులకు నెలసరి నిత్యావసర సరుకుల సబ్సిడీ పథకము :
భారత బ్రాహ్మణ సంస్థాన్ – బ్రాహ్మణ సంక్షేమ భవనం – హైదరాబాద్
204, పాపయ్య బిల్డింగ్ , కోనసీమ ద్రావిడ సంఘం ఎదురుగ , ఆంధ్ర బ్యాంక్ దగ్గర , చిక్కడ పల్లి , హైదరాబాద్

6304921292 లేదా 9701609689 వాట్సాప్

కుటుంబ ఆదాయం ఏమాత్రం సరిగా లేకుండా , సంపూర్నంగ ఇల్లు గడవని పరిస్థితి ఉంటె వారు దరఖాస్తు చేసుకుని ప్రతి నెల పదవతారీకు నాడు బియ్యం పప్పులు ఆయిల్ ఏవైనా కూడా మార్కెట్ రేటుకు సగం ధరకే ఇవ్వబడును ..

ముందు కార్డు కోసం దరఖాస్తు ఇవ్వాలి .. మీరు నేరుగా వచ్చి మన కార్యాలయం లో దరఖాస్తు అందించండి
(ఆధార్ కార్డు , తెల్ల రేషన్ కార్డు , కుటుంబ సభ్యుల ఫోటోలు లేదా గ్రూపు ఫోటో తీసుకు వస్తే సరిపోతుంది)
తదుపరి ఇల్లు వెరిఫికేషన్ ఉంటుంది –
కార్డు జారీ చేసిన తదుపరి నుండి వారు ఏ నెల ఐన 10 వ తారీకు నుండి 15 వ తారీకు లోపల నిత్యావసర వస్తువులు
నేరుగా మన సంక్షేమ భవనం లో తీసుకోవచ్చు.
మాకు ఏమాత్రం అనుమానం వచ్చినా వారి కార్డు జారీ జరుగదు ..
తక్కువ ధర కదా అని ఎవరు పడితే వారు దరఖాస్తు పెట్టుకోరాదు ..
బ్రాహ్మణ సంఘాల కమిటీ , బాడీ , సభ్యులు అర్హులు కాదు
ప్రతి రోజు దరఖాస్తులను నేరుగా వాట్సాప్ లో ఉంచబడును
మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించము
బ్రాహ్మణ సంఘాల వారు కడు పేదరికం లో ఉన్న వారిని మాకు రెఫర్ చెయ్యవచ్ఛు

ఇది స్వఛ్చందంగా చేస్తున్న బ్రాహ్మణ సేవ .. దీనిపై కామెంట్ లేదా విమర్శ చెయ్యడానికి ఎవరికీ అర్హత లేదు

ఏరోజైనా వచ్చి ఆధార్ కార్డు , తెల్ల రేషన్ కార్డు , కుటుంబ సభ్యుల ఫోటో తో సహా దరఖాస్తు చెయ్యాలి

వారికి వెంటనే జారీ నంబర్ ఇస్తారు .. ఇల్లు వెరిఫికేషన్ అయ్యాక కార్డు జారీ చేస్తారు , ఈ ప్రక్రియకు గరిష్టాంగా నెల పడుతుంది

దరఖాస్తు ఉచితం , జారీ ఉచితం , కార్డు ఉచితం …

సరుకులు సగం ధర మాత్రమే .. నాసిరకం కాదు … మంచివే..

బ్రాహ్మణ సబ్సిడీ నిత్యావసర సరుకుల కేంద్రము – చిక్కడ పల్లి

గిరి ప్రసాద్ శర్మ
9701609689

నిర్ణయం, పథకం, అమలు, జారీ తుది నిర్ణయం అన్ని
గిరి ప్రసాద్ శర్మ గారి నిర్ణయం మేరకే .. ఇతరుల జ్యోక్యం ఉండదు .